నా పేరు తాతా రమేశ్ బాబు.ఇందులో విశేషమేమి లేదు కానీ మా ఇంటి పేరు 'తాతా' అని వుండటం ,అది వినగానే ఎదుట వారి మొహం లో నవ్వు పూయటం-నా చిన్న నాటి నుండి గమనిస్తూనే వున్నాను. నేను గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామం లో పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జనవరి నెల పదిహేను వ తారీఖున పుట్టానట.మా నాన్న పేరు బసవలింగం ,అమ్మ పేరు బోలెం లక్ష్మి నరసమ్మ . మా అమ్మ గారి వూరు కృష్ణాజిల్లా దివితాలుకా, లక్ష్మీపురం . మా నాన్న విద్యా శాఖ లో పాటశాలల తనిఖి అధికారిగా వుద్యోగిస్తున్డటం వల్ల నా బాల్యం అంతా కృష్ణా జిల్లా లోనే గడచింది. వుయ్యూరు,కైకలూరు,మొవ్వ,అవనిగడ్డ లలో తొమ్మిదవ తరగతి వరకూ చదువుకున్నాను. ఆ బాల్యం నా జీవితం లో మరపు రాని ఒక అందమైన పూలతోట.పదవతరగతి మచిలీపట్టణం జైహింద్ హై స్కూల్ లో నూ,ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ లను ఆంధ్ర జాతీయ కళాశాల లోనూ చదువుకున్నాను. డిగ్రీ ఆఖరి సంవ్వత్సరం లో వుండగా మద్రాసు సిని పరిశ్రమ కు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా వెల్లవలసి వచ్చింది. అందువల్ల డిగ్రీ పూర్తి చేయలేఖ పోయాను.
నాకు చిన్ననాటి నుండి లలిత కళలు అన్నా,ఆటలు అన్నా చాలా ఇష్టం.
ఆంధ్ర జాతీయ కళాశాలలో వున్నప్పుడు హాకి,ఫుట్ బాల్,బాస్కెట్ బాల్,ఆటలే కాక పరుగు,పోల్వాల్ట్, మొదలైన ఆటలు ఇష్టం గా ఆడేవాడి ని .కృష్ణా జిల్లా బాస్కెట్ బాల్ టీం లో ఆడాను.ఇంటర్ కాలేజీ హాకీ లో ఆంధ్ర యూనివెర్సిటీ పోటిలలోరన్నర్ అప్ టీం లో వున్నాను. హాకీ ఆడటం లో నేను ప్రత్యేక శైలి లో ఉండేవాడిని.ఆ తర్వాత ఆటలు ఆడటం మానేసాను.
నా పదవతరగతి నుంచే గేయాలురాయటం ,నాటకాలు వేయటం మొదలు పెట్టాను.నా రచనలు చాలా దిన ,వార పత్రికలలో ప్రచురించ బడేవి. ప్రచురించబడిన నా పుస్తకాలు,అణువు పగిలింది (కవిత్వం),పిడికిలి (దీర్ఘ కవిత),తాతా రమేశ్ బాబు కథలు,విప్లవరుతువు(కవిత్వం),తోలిగీతలు,దిద్దు బాటు(బొమ్మలాట),తయారు చేద్దాం(క్రాఫ్ట్ వర్క్),అసలు నిజాం(బొమ్మలాట),నాన్నో పులి (బొమ్మలాట),బొమ్మలాట (బొమ్మలు తయారు చేసి ఆడించటం),శుభాకాంక్షలు(అభినందన పత్రాలు),లయ (ఆకాహవానిసమిక్షలు ) ,నా దేశం (దీర్ఘ కవిత),తాతా రమేశ్ బాబు చిత్రకళ,బాలభందు బివి జీవిత చరిత్ర.
రెండు వేల అయిదవ సంవత్సరం లో మచిలీపట్టణం నుండి వెలువడిన 'జనప్రభ' సాహిత్యమాస పత్రిక కు సంపాదకుడిగా వ్యవహరించాను. రెండువేల ఆరవ సంవత్సరం లో జాతీయ తెలుగు రచయితల మహాసభలకు ముఖ కార్యకర్త గా సేవలను అందించటమే కాక,ఆంధ్ర ప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపధ్యం లో యాభై ఏళ్ళ తెలుగు భాష ,సంస్కృతి, సాహిత్య వికాసాల సమీక్షా గా వెలువడిన నూట పన్నెండు వ్యాసాల వ్యాసాల సంకలనం 'తెలుగు పసిడి' గ్రంధానికి ఉప సంపాదకుని గా వున్నాను.అలాగే రెండువేల ఏడు సంవత్సరం లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ముఖ్య కార్య కర్త గా సేవలను అందిస్తూ,భారత స్వాతంత్ర వజ్రోత్సవాల నేపధ్యం లో వివిధ రంగాలలో తెలుగు వారి అరవై ఏళ్ళ ప్రగతి సమీక్ష గా రెండు వంద్దల పదమూడు వ్యాసాల సంకలనం 'వజ్ర భారతి ' వుద్గ్రందానికి సంపాదక వర్గం లో వున్నాను.
ఇక రంగస్థలం మీద ఫలించని వంచెన నాటిక లో కథానాయిక గా,ఏక్ దిన కా సుల్తాన్ లో మీసాల వెంకటరత్నం గా మనుషులోస్తున్నారు జాగ్రత్త లో రెడ్డి గా ,క్రాంతి లో రామారావు గా ,ది ఇంసిడెంట్ లో బ్రాహ్మణుడు గా ,తాకట్టు లో జ్ఞానేశ్ గ,కీర్తిశేషులు నాటకం లో మురారి గా,-ఆకాశవాణి,విజయవాడ కేంద్రం లో రాంబాబు కాపరం లో రాంబాబు గా ,జాతీయ నాటకం నాదయోగి లో రామరాయుడి గా ,అపూర్వ నరకం లో తమిళ అయ్యర్ గా,-హైదరాబాద్ దూరదర్శన్ లో మొదటికే మోసం బొమ్మాలాట లో పప్పెట్ గా ,సంసారం సాగరం మెగా సీరియల్ లో మంత్రగాడుగా, మినీ మూవీ లో గంగిరెడ్డి గా, లయ సీరియల్ లో వెంకట రావు గా,అబ్బాయి ప్రేమలో పడ్డాడు చలన చిత్రం లో గుండు అనుచరుడు గా , నటించటం జరిగింది.
ఆకాశ వాణి విజయవాడ కేంద్రం నుండి ,తొలి రంగుల సినిమా బొమ్మలాట నూ వివిధ భారతి లో ఇవ్వటం ,పగటి వేషాలు,సామాజిక ప్రయోజనం అనే అంశం మీద మూడు వారాల ధారావాహిక ప్రసంగాలు,గుడివాడ నాటక రంగం మీద మూడు వారాల ప్రసంగాలు ఇచ్చాను.
అంతర్జాతీయ సంస్థ ఆర్ధిక సమతా మండలి,శ్రీకాకుళం లో అయిదు సంవస్త్సరాలుగా కొన్ని వందల మంది బాల బాలికలకు ,అంగన్వాడి కార్యకర్తలకు ,ఒరగామి,నమూనాలు తయారు చేయటం,స్క్రీన్ ప్రింటింగ్,మొదలయిన అనేక కళల లో సృజనాత్మక శిక్షణ ఇస్తున్నాను.
అయిదు లక్షల కు పైగా అభినందన పత్రాలు,సూక్ష్మ చిత్రాలు,నిటి తైల వర్ణ చిత్రాలు చిత్రించాను.
గుడివాడ పురపాలక సంఘ పాటశాల అయిన అడుసుమిల్లి గోపాల కృష్ణయ్య పురపాలక ఉన్నత పాటశాల లో చిత్ర కల ఉపాధ్యాయుని గా పంతొమ్మిది వందల ఎనభై అయిదు నుండి పని చేయు చున్నాను.
Friday, February 26, 2010
*ఇతర రంగాలు
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
నవంబర్ 24, 1953లో కృష్ణా జిల్లా గుడివాడ లో జన్మించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్యుడు. హిందీలో యం.ఎ. పట్టా పొంది, తెలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టాలు సాధించాడు. నందిగామ కె.వి.ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా, ఆంధ్ర లయోలా కళాశాలలో హిందీ విభాగపు అధ్యక్షునిగా పనిచేసిన పిదప ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్య పదవి పొందినాడు. ఆచార్యునిగా 29 మంది విద్యార్థులకు పి.హెచ్.డి. మార్గదర్శకము చేశాడు. హిందీ భాష, సాహిత్యములలో విశేష కృషి చేస్తున్నాడు. పలు తెలుగు గ్రంథాలు హిందీలోకి అనువాదము చేశాడు. తెలుగులో 32 పుస్తకాలు రచించాడు. రాజ్యసభ సభ్యునిగా కూడ సేవలందించాడు.
లక్ష్మీప్రసాద్ ప్రతిష్ఠాత్మక సాహిత్యఅకాడమీ అవార్డు-2009కి ఎంపికయ్యారు. ఆయన రాసిన 'ద్రౌపది' తెలుగునవలకుగాను ఈ పురస్కారం వరించింది. లక్ష్మీప్రసాద్‌కు సాహిత్యఅకాడమీ అవార్డురావడం ఇది రెండోసారి. బిషన్‌సహానీ రాసిన 'తామస్' అనే హిందీపుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు 1992లో ఆయన సాహిత్యఅకాడమీ అనువాద అవార్డును పొందారు. కాగా, ఈ సారి ద్రౌపది పాత్రలో స్త్రీ ఔన్నత్యాన్ని విలక్షణంగా ఆవిష్కరించినందుకు సాహిత్య అకాడమీ సృజనాత్మక అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఒకేరచయిత రెండుసార్లు ఈ గౌరవాన్ని అందుకోవడం ఇదేతొలిసారి.
పురస్కారాలు, పదవులు
- పద్మశ్రీ - 2003
- కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారము - 1992
- తానా Human Exellency Award - 2008
- జాతీయ హిందీ అకాడెమి - విశిష్ఠ హిందీ సేవా సమ్మాన్ - 2009
- అధ్యక్షుడు, హిందీ అకాడెమి
- అధ్యక్షుడు,లోక్ నాయక్ ఫౌండేషన్
- కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి - ద్రౌపది నవల - ౨౦౦౯
అక్కినేని నాగేశ్వరరావు
| అక్కినేని నాగేశ్వరరావు | |
| జననం | సెప్టెంబర్ 20, 1924 వేంకటరాఘవాపురం, గుడివాడ తాలూకా |
|---|---|
| స్వస్థలం | వేంకటరాఘవాపురం |
| నివాసం | హైదరాబాదు |
| ఇతర పేర్లు | ఎ.యన్.ఆర్, అక్కినేని |
| వృత్తి | నటన |
| భార్య/భర్త | అక్కినేని అన్నపూర్ణ |
| సంతానం | 5 మంది |
మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తన వంతు కృషి చేశారు. గుడివాడ లోని కళాశాలకు భూరివిరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు పేరిట A N R COLLEGE అని నామకరణం చేశారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశారు.
విరాళాల రూపంలోనే కాకుండా ఒక గొప్ప సమాజ నిర్మాణానికి తోత్పడడానికి "సుడిగుండాలు", "మరో ప్రపంచం" వంటి సందేశాత్మక చిత్రాలను శ్రీ ఆదుర్తి సుబ్బారావు తో "చక్రవర్తి చిత్ర" పతాకంపై నిర్మించారు.
విషయ సూచిక |
పురస్కారాలు
- 1. విశిష్ట వ్యక్తి అవార్డు - 10.03.1988 - సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
- 2. రాజ్ కపూర్ స్మారక అవార్డు - 10.06.1989 - కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్.
- 3. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు - 10.03.1980 - ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియం.
- 4. పద్మ భూషణ్ - 1988 - భారత ప్రభుత్వం.
- 5. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు - 07.04.1991 - ఆర్. వెంకట్ రామన్, భారత రాష్ట్రపతి, కొత్త ఢిల్లి.
- 6. లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు - 21.10.1994 - కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్.
- 7. అన్నా అవార్డు - 24.11.1995 - జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై.
- 8. పద్మ శ్రీ
బిరుదులు
- నటసమ్రాట్
- కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్)
- మహా నటుడు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (భారత ప్రభుత్వం)
- కాళిదాస్ సమ్మాన్ (మధ్య ప్రదేశ్ ప్రభుత్వం)
- ఎన్ టి ఆర్ అవార్డు (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం)
- రఘుపతి వెంకయ్య అవార్డు (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం)
నటించిన సినిమాలు
| క్రమ సంఖ్య | విడుదల తేది | సినిమా పేరు | దర్శకత్వం | కథానాయిక(లు) |
|---|---|---|---|---|
| 1 | 10/1/1941 | ధర్మపత్ని | పి.పుల్లయ్య | |
| 2 | 7/12/1944 | సీతారామ జననం | ఘంటసాల బలరామయ్య | |
| 3 | 10/10/1945 | మాయలోకం | గూడవల్లి రామబ్రహ్మం | ఎస్.వరలక్ష్మి |
| 4 | 2/1/1946 | రత్నమాల | పి.రామకృష్ణ | భానుమతి |
| 5 | 1/8/1946 | ముగ్గురు మరాఠీలు | ఘంటసాల బలరామయ్య | టి.జి.కమలాదేవి |
| 6 | 24/09/1947 | పల్నాటి యుద్ధం | గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్ | ఎస్.వరలక్ష్మి |
| 7 | 28/02/1948 | బాలరాజు | ఘంటసాల బలరామయ్య | ఎస్. వరలక్ష్మి |
| 8 | 19/02/1949 | కీలుగుర్రం | మీర్జాపురం రాజా | |
| 9 | 30/04/1949 | రక్ష రేఖ | ఆర్. పద్మనాభన్ | అంజలీదేవి, భానుమతి |
| 10 | 1/10/1949 | లైలా మజ్ఞు | పి. రామక్రిష్ణ | భానుమతి |
| 11 | 28/02/1950 | శ్రీలక్ష్మమ్మ కథ | ఘంటసాల బలరామయ్య | అంజలీదేవి |
| 12 | 27/04/1950 | పల్లెటూరి పిల్ల | బి.ఎ.సుబ్బారావు | అంజలీదేవి |
| 13 | 6/10/1950 | పరమానందయ్య శిష్యుల కథ | కస్తూరి శివరావు | గిరిజ |
| 14 | 10/11/1950 | స్వప్న సుందరి | ఘంటసాల బలరామయ్య | అంజలీదేవి, జి.వరలక్ష్మి |
| 15 | 29/12/1950 | సంసారం | ఎల్.వి.ప్రసాద్ | లక్ష్మీరాజ్యం |
| 16 | 16/02/1951 | మయమలై (తమిళం) | మీర్జాపురం రాజా | అంజలీదేవి |
| 17 | 16/02/1951 | తిలోత్తమ | మీర్జాపురం రాజా | |
| 18 | 14/06/1951 | మాయలమారి | పి. శ్రీధర్ | అంజలీదేవి |
| 19 | 21/08/1951 | స్త్రీ సాహసం (తమిళం) | వేదాంతం రాఘవయ్య | |
| 20 | 9/8/1951 | స్త్రీ సాహసం | వేదాంతం రాఘవయ్య | |
| 21 | 11/4/1951 | ఒరే ఇరువు (తమిళం) | పి. నీలకంఠన్ | |
| 22 | 11/4/1951 | సౌదామిని | కె.బి.నాగభూషణం | |
| 23 | 11/4/1951 | సౌదామిని (తమిళం) | కె.బి. నాగభూషణం | |
| 24 | 11/9/1951 | మంత్రదండం | కె. రామచంద్ర రావు | |
| 25 | 4/12/1951 | మాయకారి (తమిళం) | పి. శ్రీధర్ | |
| 26 | 21/03/1952 | ప్రేమ | పి. రామక్రిష్ణ | భానుమతి |
| 27 | 14/06/1952 | కాదల్ (తమిళం) | పి. రామక్రిష్ణ | భానుమతి |
| 28 | 14/01/1953 | పరదేశి | ఎల్.వి. ప్రసాద్ | |
| 29 | 15/01/1953 | పెన్న్మనం (తమిళం) | ఎస్. సౌందరాజన్ | |
| 30 | 1/2/1953 | పుంగోరై (తమిళం) | ఎల్.వి. ప్రసాద్ | |
| 31 | 6/2/1953 | బ్రతుకుతెరువు | పి. రామకృష్ణ | శ్రీరంజని, సావిత్రి |
| 32 | 16/04/1953 | కన్నతల్లి | కె.యస్.ప్రకాశరావు | కృష్ణకుమారి |
| 33 | 15/05/1953 | పెట్రతాయ్ (తమిళ్) | కె.యస్.ప్రకాశరావు. | |
| 34 | 6/6/1953 | వయ్యారిభామ | పి. సుబ్బారావు | |
| 35 | 26/06/1953 | దేవదాసు | వేదాంతం రాఘవయ్య | సావిత్రి |
| 36 | 11/9/1953 | దేవదాసు (తమిళం) | వేదాంతం రాఘవయ్య | సావిత్రి |
| 37 | 1/1/1954 | పూజాఫలం | బి.యన్.రెడ్డి | సావిత్రి, జమున |
| 38 | 2/3/1954 | నిరుపేదలు | తాతినేని ప్రకాశరావు | |
| 39 | 19/03/1954 | ఛక్రపాణి | పి. రామకృష్ణ | |
| 40 | 1/9/1954 | పరివర్తన | తాతినేని ప్రకాశరావు | |
| 41 | 10/12/1954 | విప్రనారాయణ | పి. రామకృష్ణ | భానుమతి |
| 42 | 17/12/1954 | అన్నదాత | వేదాంతం రాఘవయ్య | |
| 43 | 1/10/1955 | దొంగ రాముడు | కె.వి. రెడ్డి | సావిత్రి |
| 44 | 12/1/1955 | మిస్సమ్మ | ఎల్.వి. ప్రసాద్ | జమున |
| 45 | 26/01/1955 | అర్ధాంగి | పి. పుల్లయ్య | సావిత్రి |
| 46 | 28/04/1955 | అనార్కలి | వేదాంతం రాఘవయ్య | అంజలి దేవి |
| 47 | 5/8/1955 | సంతానం | సి.వి. రంగనాధ దాస్ | సావిత్రి |
| 48 | 9/8/1955 | వదిన | యం.వి. రామన్ | పండరీభాయి |
| 49 | 12/1/1956 | తెనాలి రామకృష్ణ | బి.యస్. రంగా | జమున |
| 50 | 6/4/1956 | భలే రాముడు | వేదాంతం రాఘవయ్య | సావిత్రి |
| 51 | 21/06/1956 | ఇలవేల్పు | డి. యోగానంద్ | అంజలి దేవి |
| 52 | 20/12/1956 | చరణదాసి | తాతినేని ప్రకాశరావు | సావిత్రి |
| 53 | 21/12/1956 | మదర్ కుల మాణిక్యం (తమిళ్) | తాతినేని ప్రకాశరావు | |
| 54 | 11/1/1957 | తోడికోడళ్ళు | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి |
| 55 | 12/1/1957 | సతీ సావిత్రి | కె.బి. నాగభూషణం | యస్. వరలక్ష్మి |
| 56 | 1/2/1957 | ఎంగ వీట్టు మహలక్ష్మి (తమిళ్) | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి |
| 57 | 27/03/1957 | మాయాబజార్ | కె.వి. రెడ్డి | సావిత్రి |
| 58 | 29/03/1957 | అల్లావుద్దీన్(తమిళం) | టి.ఆర్. రఘునాథ్ | |
| 59 | 13/04/1957 | అల్లావుద్దీన్ | టి. ఆర్. రఘునాథ్ | |
| 60 | 19/07/1957 | దొంగల్లో దొర | చెంగయ్య | జమున |
| 61 | 20/02/1958 | భూకైలాస్ | కె. శంకర్ | --- |
| 62 | 20/05/1958 | చెంచులక్ష్మి (తమిళం) | బి.ఎ. సుబ్బారావు | అంజలీ దేవి |
| 63 | 21/06/1958 | కలిమిలేములు | గుత్తా రామినీడు | |
| 64 | 6/8/1958 | ఆడపెత్తనం | ఆదుర్తి సుబ్బారావు | |
| 65 | 7/11/1958 | సువర్ణ సుందరి (హిందీ) | వేదాంతం రాఘవయ్య | అంజలి దేవి |
| 66 | 9/4/1958 | చెంచులక్ష్మి | బి.ఎ. సుబ్బారావు | అంజలి దేవి |
| 67 | 12/6/1958 | కృష్ణమాయ | సి.యస్. రావు | |
| 68 | 14/01/1959 | మంజుల్ మహిమయ్ (తమిళ్) | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి |
| 69 | 9/4/1959 | జయభేరి | పి. పుల్లయ్య | అంజలి దేవి |
| 70 | 9/4/1959 | కళ్యాణ పరిసు (తమిళ్) | సి.వి. శ్రీధర్ | బి. సరోజాదేవి |
| 71 | 1/5/1959 | ఇల్లరికం | ప్రత్యగాత్మ | జమున |
| 72 | 5/6/1959 | కళైవన్నన్ (తమిళ్) | సి. పుల్లయ్య | |
| 73 | 6/8/1959 | అతిశయ పెణ్ (తమిళ్) | యం.వి. రామన్ | |
| 74 | 4/9/1959 | నాళక్కై ఒప్పందం (తమిళ్) | కె.వి. రెడ్డి | |
| 75 | 30/10/1959 | దైవమే తునై (తమిళ్) | సి.హెచ్.నారాయణమూర్తి | |
| 76 | 17/12/1959 | పెళ్ళి సందడి | డి. యోగానంద్ | అంజలి దేవి |
| 77 | 7/1/1960 | నమ్మినబంటు | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి |
| 78 | 27/01/1960 | అన్బుమగన్ (తమిళ్) | తాతినేని ప్రకాశరావు | |
| 79 | 19/02/1960 | పట్టలియన్ వేట్రై (తమిళ్) | ఆదుర్తి సుబ్బారావు | |
| 80 | 2/4/1960 | మహాకవి కాళిదాసు | కమలాకర కామేశ్వరరావు | శ్రీరంజని |
| 81 | 29/04/1960 | పెళ్ళికానుక | సి.వి.శ్రీధర్ | బి.సరోజాదేవి, కృష్ణకుమారి |
| 82 | 7/12/1960 | రుణానుబంధం | వేదాంతం రాఘవయ్య | అంజలిదేవి |
| 83 | 8/7/1960 | ఎంగళ్ సెలవై (తమిళ్) | డి.యోగానంద్ | |
| 84 | 26/08/1960 | అభిమానం | సి.యస్.రావు | సావిత్రి |
| 85 | 22/12/1960 | మా బాబు | తాతినేని ప్రకాశరావు | |
| 86 | 7/1/1961 | వెలుగు నీడలు | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి, గిరిజ |
| 87 | 14/01/1961 | తుయి ఉల్లం (తమిళ్) | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి |
| 88 | 31/03/1961 | భార్యా భర్తలు | ప్రత్యగాత్మ | కృష్ణకుమారి |
| 89 | 7/4/1961 | భక్త జయదేవ | పి.వి.రామారావు | అంజలీదేవి |
| 90 | 30/06/1961 | బాటసారి | పి.రామకృష్ణ | భానుమతి |
| 91 | 21/07/1961 | కనాళ నీర్ (తమిళ్) | పి.రామకృష్ణ | భానుమతి |
| 92 | 5/10/1961 | వాగ్ధానం | ఆత్రేయ | కృష్ణకుమారి |
| 93 | 29/12/1961 | ముగ్గురు మరాఠీలు | ఆదుర్తి సుబ్బారావు | రాజ సులోచన, బి.వి.సరోజ |
| 94 | 16/02/1962 | ఆరాధన | వి.మదుసూధనరావు | సావిత్రి |
| 95 | 11/4/1962 | మంచిమనసులు | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి |
| 96 | 7/6/1962 | గుండమ్మ కథ | కమలాకర కామేశ్వరరావు | జమున |
| 97 | 24/08/1962 | కులగోత్రాలు | ప్రత్యగాత్మ | కృష్ణకుమారి |
| 98 | 8/9/1962 | మీండమ్ మరవిల్లై (తమిళ్) | కమలాకర కామేశ్వరరావు | |
| 99 | 19/09/1962 | సిరిసంపదలు | పి.పుల్లయ్య | సావిత్రి |
| 100 | 12/2/1963 | ఊరంతా సంక్రాంతి | దాసరి నారాయణరావు | |
| 101 | 10/4/1963 | చదువుకున్న అమ్మాయిలు | ఆదుర్తి సుబ్బారావు | కృష్ణకుమారి |
| 102 | 29/08/1963 | పునర్జన్మ | ప్రత్యగాత్మ | కృష్ణకుమారి |
| 103 | 9/1/1964 | ఆత్మబలం | వి.మధుసూదనరావు | బి.సరోజాదేవి |
| 104 | 30/01/1964 | మూగ మనసులు | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి,జమున |
| 105 | 14/02/1964 | మురళీకృష్ణ | పి.పుల్లయ్య | జమున |
| 106 | 27/03/1964 | అమరశిల్పి జక్కన్న | బి.యస్.రంగా | బి.సరోజాదేవి |
| 107 | 10/7/1964 | డాక్టర్ చక్రవర్తి | ఆదుర్తి సుబ్బారావు | కృష్ణ కుమారి |
| 108 | 1/1/1965 | సుమంగళి | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి |
| 109 | 14/04/1965 | రోజులు మారాయి | తాపీ చాణక్య | షావుకారు జానకి |
| 110 | 27/05/1965 | అంతస్తులు | వి.మధుసూదనరావు | జయలలిత |
| 111 | 24/08/1965 | ప్రేమించి చూడు | పి.పుల్లయ్య | కాంచన |
| 112 | 3/9/1965 | మనసులు-మమతలు | ప్రత్యగాత్మ | సావిత్రి, జయలలిత |
| 113 | 7/1/1966 | జమిందార్ | వి.మధుసూదనరావు | కృష్ణకుమారి |
| 114 | 18/03/1966 | ఆత్మగౌరవం | కె.విశ్వనాథ్ | కాంచన |
| 115 | 22/04/1966 | నవరాత్రి | తాతినేని రామారావు | సావిత్రి |
| 116 | 6/10/1966 | మనసే మందిరం | సి.వి.శ్రీధర్ | సావిత్రి |
| 117 | 18/11/1966 | ఆస్తిపరులు | వి.మధుసూదనరావు | జయలలిత |
| 118 | 7/4/1967 | గృహలక్ష్మి | పి.రామకృష్ణ | భానుమతి |
| 119 | 1/5/1967 | సువర్ణసుందరి | వేధాంతం రాఘవయ్య | అంజలిదేవి |
| 120 | 6/5/1967 | ప్రాణమిత్రులు | పి.పుల్లయ్య | సావిత్రి |
| 121 | 10/8/1967 | వసంతసేన | బి.యస్.రంగా | |
| 122 | 10/11/1967 | రహస్యం | వేదాంతం రాఘవయ్య | కృష్ణకుమారి |
| 123 | 24/11/1967 | పూలరంగడు | ఆదుర్తి సుబ్బారావు | జమున |
| 124 | 7/1/1968 | మాంగల్యబలం | ఆదుర్తి సుబ్బారావు | సావిత్రి |
| 125 | 9/1/1968 | శ్రీకృష్ణార్జున యుద్ధం | కె.వి.రెడ్డి | బి.సరోజాదేవి |
| 126 | 1/2/1968 | బ్రహ్మచారి | తాతినేని రామారావు | జయలలిత |
| 127 | 15/03/1968 | మంచికుటుంభం | వి.మధుసూధనరావు | |
| 128 | 19/04/1968 | గోవులగోపన్న | సి.వి.రావు | భారతి,రాజశ్రీ |
| 129 | 22/08/1968 | బంగారు గాజులు | సి.యస్.రావు | భారతి |
| 130 | 28/08/1968 | సుడిగుండాలు | ఆదుర్తి సుబ్బారావు | --- |
| 131 | 3/1/1969 | అదృష్టవంతులు | వి.మధుసూదనరావు | జయలలిత |
| 132 | 19/02/1969 | మూగనోము | డి.యోగానంద్ | జమున |
| 133 | 13/03/1969 | బందిపోటు దొంగలు | కె.యస్.ప్రకాశరావు | జమున |
| 134 | 9/5/1969 | ఆదర్శకుటుంబం | ప్రత్యగాత్మ | జయలలిత |
| 135 | 24/07/1969 | ఆత్మీయులు | వి.మధుసూదనరావు | వాణిశ్రీ |
| 136 | 14/08/1969 | భలే రంగడు | తాతినేని రామారావు | |
| 137 | 20/09/1969 | బుద్ధిమంతుడు | బాపు | విజయనిర్మల |
| 138 | 30/10/1969 | సిపాయి చిన్నయ్య | జి.వి.ఆర్.శేషగిరిరావు | భారతి |
| 139 | 1/1/1970 | అక్కాచెల్లెలు | ఏ.సంజీవి | షావుకారు జానకి,విజయనిర్మల |
| 140 | 26/02/1970 | జై జవాన్ | డి.యోగానంద్ | భారతి |
| 141 | 10/4/1970 | మరో ప్రపంచం | ఆదుర్తి సుబ్బారావు | |
| 142 | 8/5/1970 | ధర్మదాత | ఏ.సంజీవి | కాంచన |
| 143 | 2/10/1970 | ఇద్దరు అమ్మాయిలు | పుట్టణ కనగళ్ | వాణిశ్రీ |
| 144 | 13/01/1971 | దసరా బుల్లోడు | వి.బి.రాజేంద్ర ప్రసాద్ | వాణిశ్రీ,చంద్రకళ |
| 145 | 21/01/1971 | మనసు మాంగల్యం | ప్రత్యగాత్మ | |
| 146 | 29/01/1971 | సుపుత్రుడు | తాతినేని రామారావు | లక్ష్మి |
| 147 | 29/02/1971 | పవిత్రబంధం | వి.మధుసూధనరావు | వాణిశ్రీ |
| 148 | 3/6/1971 | అమాయకురాలు | వి.మధుసూదనరావు | కాంచన |
| 149 | 18/07/1971 | శ్రీమంతుడు | ప్రత్యగాత్మ | జమున |
| 150 | 11/8/1971 | రంగేళీరాజా | సి.యస్.రావు | |
| 151 | 24/09/1971 | ప్రేమనగర్ | కె.యస్.ప్రకాశరావు | వాణిశ్రీ |
| 152 | 14/01/1972 | భార్యా బిడ్డలు | తాతినేని రామారావు | కృష్ణకుమారి |
| 153 | 17/02/1972 | రైతుకుటుంబం | వి.మదుసూధనరావు | కాంచన |
| 154 | 24/03/1972 | బీదలపాట్లు | బి.విఠలాచార్య | |
| 155 | 12/5/1972 | మంచిరోజులొచ్చాయి | వి.మధుసూధనరావు | కాంచన |
| 156 | 15/06/1972 | దత్తపుత్రుడు | టి.లెనిన్ బాబు | వాణిశ్రీ |
| 157 | 12/10/1972 | విచిత్రబంధం | ఆదుర్తి సుబ్బారావు | వాణిశ్రీ |
| 158 | 22/12/1972 | కొడుకు కోడలు | పి.పుల్లయ్య | వాణిశ్రీ,లక్ష్మి |
| 159 | 15/03/1973 | బంగారు బాబు | వి.బి.రాజేంద్రప్రసాద్ | వాణిశ్రీ |
| 160 | 11/5/1973 | కన్నకొడుకు | వి.మధుసూదనరావు | కాంచన |
| 161 | 6/7/1973 | భక్తతుకారాం | వి.మధుసూదనరావు | అంజలీదేవి |
| 162 | 15/08/1973 | పల్లెటూరిబావ | ప్రత్యగాత్మ | లక్ష్మి,శుభ |
| 163 | 20/09/1973 | అందాలరాముడు | బాపు | లత |
| 164 | 23/11/1973 | మరపురాని మనిషి | తాతినేని రామారావు | మంజుల |
| 165 | 12/1/1974 | ప్రేమలు-పెళ్ళిల్లు | వి.మధుసూధనరావు | శారద,జయలలిత |
| 166 | 21/02/1974 | మంచివాడు | వి.మధుసూదనరావు | కాంచన,వాణిశ్రీ |
| 167 | 21/06/1974 | బంగారు కలలు | ఆదుర్తి సుబ్బారావు | లక్ష్మి |
| 168 | 31/10/1974 | దొరబాబు | తాతినేని రామారావు | మంజుల |
| 169 | 30/03/1976 | మహాకవి క్షేత్రయ్య | ఆదుర్తి సుబ్బారావు | మంజుల |
| 170 | 28/04/1976 | సెక్రటరీ | కె.యస్.ప్రకాశరావు | వాణిశ్రీ |
| 171 | 15/10/1976 | మహాత్ముడు | ఎం.ఎస్.గోపీనాధ్ | |
| 172 | 3/2/1977 | చక్రధారి | వి.మధుసూధనరావు | వాణిశ్రీ, జయప్రద |
| 173 | 17/03/1977 | ఆలుమగలు | తాతినేని రామారావు | వాణిశ్రీ |
| 174 | 14/04/1977 | బంగారు బొమ్మలు | వి.బి.రాజేంద్రప్రసాద్ | మంజుల |
| 175 | 20/07/1977 | రాజా రమేష్ | వి.మధుసూదనరావు | వాణిశ్రీ |
| 176 | 25/08/1977 | చాణక్య చంద్రగుప్త | ఎన్.టి.రామారావు | --- |
| 177 | 23/11/1977 | ఆత్మీయుడు | తాతినేని రామారావు | వాణిశ్రీ |
| 178 | 11/1/1978 | చిలిపి కృష్ణుడు | బోయిన సుబ్బారావు | వాణిశ్రీ |
| 179 | 23/03/1978 | దేవదాసు మళ్ళీపుట్టాడు | దాసరి నారాయణరావు | వాణిశ్రీ, జయప్రద |
| 180 | 14/04/1978 | విచిత్ర జీవితం | వి.మధుసూదనరావు | వాణిశ్రీ |
| 181 | 8/6/1978 | రామకృష్ణులు | వి.బి.రాజేంద్ర ప్రసాద్ | జయప్రద |
| 182 | 2/11/1978 | శ్రీరామరక్ష | తాతినేని రామారావు | వాణిశ్రీ |
| 183 | 16/02/1979 | రావణుడే రాముడైతే | దాసరి నారాయణరావు | జయచిత్ర.లత |
| 184 | 28/03/1979 | హేమాహేమీలు | విజయనిర్మల | జరీనా వహాబ్ |
| 185 | 8/6/1979 | ముద్దుల కొడుకు | వి.బి.రాజేంద్ర ప్రసాద్ | శ్రీదేవి, జయసుధ |
| 186 | 15/06/1979 | అండమాన్ అమ్మాయి | వి.మధుసూదనరావు | వాణిశ్రీ |
| 187 | 11/1/1980 | ఏడంతస్తుల మేడ | దాసరి నారాయణరావు | సుజాత, జయసుధ |
| 188 | 14/01/1960 | శాంతి నివాసం | సి.యస్.రావు | రాజసులోచన |
| 189 | 1/2/1980 | నాయకుడు-వినాయకుడు | ప్రత్యాగాత్మ | జయలలిత |
| 190 | 21/03/1980 | బుచ్చిబాబు | దాసరి నారాయణరావు | జయప్రద |
| 191 | 29/04/1960 | పెళ్ళినాటి ప్రమాణాలు | కె.వి.రెడ్డి | జమున, రాజసులోచన |
| 192 | 26/09/1980 | పిల్ల జమిందార్ | సింగీతం శ్రీనివాసరావు | జయసుధ |
| 193 | 1/1/1981 | శ్రీవారి ముచ్చట్లు | దాసరి నారాయణరావు | జయసుధ, జయప్రద |
| 194 | 18/02/1981 | ప్రేమాభిషేకం | దాసరి నారాయణరావు | శ్రీదేవి, జయసుధ |
| 195 | 28/05/1981 | సత్యమ్-శివమ్ | కె.రాఘవేంద్రరావు | రతి అగ్నిహోత్రి |
| 196 | 27/06/1981 | ప్రేమ కానుక | కె.రాఘవేంద్రరావు | సుజాత, శ్రీదేవి |
| 197 | 21/08/1981 | గురుశిష్యులు | కె.బాపయ్య | సుజాత |
| 198 | 24/08/1981 | ప్రేమమందిరం | దాసరి నారాయణరావు | జయప్రద |
| 199 | 8/12/1961 | శభాష్ రాజా | రామకృష్ణ | కృష్ణకుమారి |
| 200 | 11/1/1982 | రాగదీపం | దాసరి నారాయణరావు | రాధ, జయసుధ |
| 201 | 2/4/1982 | బంగారు కానుక | వి. మధుసూదనరావు | శ్రీదేవి |
| 202 | 1/7/1982 | గోపాలకృష్ణుడు | ఎ. కోదండరామిరెడ్డి | రాధ, జయసుధ |
| 203 | 22/08/1982 | శ్రీరంగనీతులు | ఎ. కోదండరామిరెడ్డి | శ్రీదేవి |
| 204 | 24/09/1982 | మేఘసందేశం | దాసరి నారాయణరావు | జయసుధ, జయప్రద |
| 205 | 19/12/1982 | యువరాజు | దాసరి నారాయణరావు | సుజాత, జయసుధ |
| 206 | 4/2/1983 | ముద్దుల మొగుడు | టి.యస్.ప్రకాశరావు | |
| 207 | 19/05/1983 | బహుదూరపు బాటసారి | దాసరి నారాయణరావు | సుజాత |
| 208 | 19/08/1983 | అమరజీవి | జంధ్యాల | జయప్రద, సుమలత |
| 209 | 6/1/1984 | కోటీశ్వరుడు | కొమ్మినేని శేషగిరిరావు | సుజాత |
| 210 | 26/01/1984 | తాండవ కృష్ణుడు | పి. చంద్రశేఖరరెడ్డి | |
| 211 | 30/03/1984 | అనుబంధం | ఎ.కోదండరామిరెడ్డి | రాధిక, సుజాత |
| 212 | 11/5/1984 | యస్.పి. భయంకర్ | వి.బి.రాజేంద్రప్రసాద్ | శ్రీదేవి |
| 213 | 24/08/1984 | వసంతగీతం | సింగీతం శ్రీనివాసరావు | రాధ |
| 214 | 20/09/1984 | జస్టిస్ చక్రవర్తి | దాసరి నారాయణరావు | సుజాత |
| 215 | 23/11/1984 | సంగీత సామ్రాట్ | సింగీతం శ్రీనివాసరావు | జయప్రద |
| 216 | 28/03/1985 | భార్యాభర్తల బంధం | వి.బి. రాజేంద్రప్రసాద్ | జయసుధ |
| 217 | 12/7/1985 | దాంపత్యం | ఎ.కోదండరామిరెడ్డి | సుజాత, రాధిక |
| 218 | 12/9/1985 | ఇల్లాలే దేవత | తాతినేని ప్రసాద్ | భానుప్రియ, రాధిక |
| 219 | 20/06/1986 | ఆదిదంపతులు | దాసరి నారాయణరావు | జయసుధ |
| 220 | 14/11/1986 | బ్రహ్మరుద్రులు | కె. రాఘవేంద్రరావు | లక్ష్మి |
| 221 | 25/12/1986 | గురుబ్రహ్మ | బోయిన సుబ్బారావు | శారద |
| 222 | 9/4/1987 | కలెక్టరుగారి అబ్బాయి | బి. గోపాల్ | శారద |
| 223 | 27/08/1987 | అగ్నిపుత్రుడు | కె. రాఘవేంద్రరావు | శారద |
| 224 | 1/10/1987 | ఆత్మబంధువు | దాసరి నారాయణరావు | జయసుధ |
| 225 | 14/01/1988 | రాజేశ్వరి కళ్యాణం | క్రాంతి కుమార్ | వాణిశ్రీ |
| 226 | 8/6/1988 | రావుగారిల్లు | తరణి | జయసుధ, రేవతి |
| 227 | 14/01/1989 | రాజకీయ చదరంగం | పి. చంద్రశేఖర్ రెడ్డి | |
| 228 | 24/02/1989 | భలే దంపతులు | కోడి రామకృష్ణ | జయసుధ |
| 229 | 11/5/1989 | సూత్రధారులు | కె.విశ్వనాథ్ | సుజాత |
| 230 | 7/12/1989 | ఆదర్శవంతుడు | కోడి రామకృష్ణ | |
| 231 | 12/1/1980 | రావుగారింట్లో రౌడీ | కోడి రామకృష్ణ | |
| 232 | 7/9/1990 | ఇద్దరూ ఇద్దరే | ఎ. కోదండరామిరెడ్డి | శారద |
| 233 | 30/11/1990 | దాగుడుమూతల దాంపత్యం | రేలంగి నరసింహారావు | జయసుధ |
| 234 | 11/1/1991 | సీతారామయ్యగారి మనుమరాలు | క్రాంతి కుమార్ | రోహిణీ హట్టంగడి |
| 235 | 15/01/1992 | ప్రాణదాత | మోహన్ గాంధీ | లక్ష్మి |
| 236 | 20/02/1992 | రగులుతున్న భారతం | అల్లాణి శ్రీధర్ | |
| 237 | 16/04/1992 | మాధవయ్యగారి మనవడు | ముత్యాల సుబ్బయ్య | |
| 238 | 2/7/1992 | కాలేజి బుల్లోడు | శరత్ | లక్ష్మి |
| 239 | 18/02/1994 | బంగారు కుటుంబం | దాసరి నారాయణరావు | జయసుధ |
| 240 | 18/08/1994 | గాంఢీవం | ప్రియదర్శన్ | శ్రీవిద్య |
| 241 | 17/10/1994 | తీర్పు | ఉప్పలపాటి నారాయణరావు | రోహిణీ హట్టంగడి |
| 242 | 23/03/1995 | గాడ్ ఫాదర్ | కోడి రామకృష్ణ | |
| 243 | 2/5/1996 | రాముడు కాదు కృష్ణుడు | దాసరి నారాయణరావు | జయసుధ |
| 244 | 11/5/1996 | మాయాబజార్ | దాసరి నారాయణరావు | |
| 245 | 12/5/1996 | రాయుడుగారు నాయుడుగారు | దాసరి నారాయణరావు | సుజాత |
| 246 | 16/04/1998 | రథసారధి | కోడి రామకృష్ణ | లక్ష్మి |
| 247 | 1/5/1998 | పండగ | శరత్ | జయసుధ |
| 248 | 27/05/1998 | మెకానిక్ అల్లుడు | బి. గోపాల్ | శారద |
| 249 | 28/08/1998 | సీతారాముల కళ్యాణము చూతము రారండి | వై.వి.యస్. ఛౌదరి | |
| 250 | 3/9/1998 | డాడీ డాడీ | కోడి రామకృష్ణ | జయసుధ |
| 251 | 27/07/2000 | పెళ్ళి సంబంధం | కె. రాఘవేంద్రరావు | |
| 252 | 27/12/2000 | సకుటుంబ సపరివార సమేతం | యస్.వి.కృష్ణారెడ్డి | |
| 253 | 11/1/2006 | చుక్కల్లో చంద్రుదు | శివకుమార్ | వాహిదా రెహమాన్ |
| 254 | 2006 | శ్రీ రామదాసు | కె. రాఘవేంద్రరావు | --- |
| కైకాల సత్యనారాయణ | |
| జననం | జూలై 25 ,1935 కౌతవరం, ఆంధ్రప్రదేశ్ |
|---|---|
| ఇతర పేర్లు | నవరస నటసార్వభౌమ |
| ప్రాముఖ్యత | సినిమాలు, రాజకీయం |
| రాజకీయ పార్టీ | [[]] |
| మతం | హిందూమతం |
| భార్య/భర్త | నాగేశ్వరమ్మ |
వ్యక్తిగత జీవితం
సత్యనారాయణ కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఇద్దరు కొడుకులు.సినీ జీవితం
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. ఆయన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959 లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, ఆయన రూపు రేఖలు యన్.టి.ఆర్ ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడ ఈయన్ని గమనించారు. 1960 లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి లో ఈయనకి ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనక దుర్గ పూజా మహిమ లో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో ఆయన ప్ర్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ కారెక్టర్ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయన్ని సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ లాంటి ఒక విలక్షణ నటుడు దొరకటం ఒక వరం. ఈయన వెయ్యని పాత్ర అంటూ లేదు. ఆయన ఏపాత్ర వేసినా ఆ పాత్రలో జీవించాడు. ఆయన యమగోల మరియు యమలీలకృష్ణుడిగా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలు చాలావరకు సత్యనారాయణ పోషించారు.పౌరాణికాల్లో రావణుడు,దుర్యోధనుడు,యముడు,ఘటోద్గచుడు సాంఘికాల్లో రౌడీ,కధానాయకుని (కథాకనాయిక) తండ్రి,తాత మొదలైనవి. చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు.
సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు.
రాజకీయాలు
1996 లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి 11వ లోక్‌సభ కి ఎన్నికయ్యాడు.చిత్ర సమాహారం
గుర్తింపులు మరియు బహుమతులు
- నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చినది.
- నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది
- కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
- నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చినది.
గణాంకాలు
- 777 సినిమాలు ఇప్పటిదాకా
- 28 పౌరాణిక చిత్రాలు
- 51 జానపద చిత్రాలు
- 9 చారిత్రక చిత్రాలు
- 200 మంది దర్శకులతో పనిచేసాడు
- 223 సినిమాలు 100 రోజులు ఆడాయి
- 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి
- 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి
- 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవ
Subscribe to:
Comments (Atom)
