Thursday, July 1, 2010

పాటల ఘనాపాటి "వేటూరి"

పాటల ఘనాపాటి "వేటూరి"

-"భావకవి" చక్కా పాండు రంగారావు
రంగ &కో ,మెయిన్ రోడ్ ,గుడివాడ
321301



వేటూరీ, నీ హతన్మరణం పెద్ద వేటు
తెలుగు సినీ రంగానికి తీరని లోటు
పాటలతో పదనిసలు పలికించావు
మాటలతో మధురిమలు కురిపించావు
నీ రాగాలకు మహా రోగాలు మాయం
నీ గేయాలకు గాయాలు మటుమాయం
నీ పాటలతో తెలుగు తేజం వెలిగింది
నీ త్యాగంతో తెలుగు జాతి మేల్కొంది
నీ పాటల పల్లవి లో ఊరేగిన "నటులు "
తెలుగు తెర మీద అయ్యారు " మహా నటులు "
దివిసీమలో పుట్టి దివికేగిన ఘనాపాటి ,
దివిటీలతో వెదికినా దొరకునా నీకు సాటి!
మరు జన్మలో మళ్ళి కల్లేపల్లి లో పుట్టు
విలక్షణ పాటల విశ్వరూపం చూపెట్టు

&&&&&&&&& &&&&&&&&&&